వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్: నీట్ పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

నీట్ పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియను అక్టోబర్ పన్నెండు నుంచి నిర్వహిస్తామని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు అక్టోబర్ ఇరవై నాల్గవ తేదీన విడుదలవుతాయని అధికారులు స్పష్టం చేశారు.