రాప్తాడులో ఎన్టీఆర్ జ్ఞాపకాలను గుర్తుచేసిన మంత్రి నారా లోకేష్

రిపోర్టర్: సతీష్ స్థలం: Raptadu

పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాప్తాడు పర్యటనలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు ఎన్టీఆర్‌కు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పలికారని, అదే తరహా ఆదరణ ఈరోజు రాప్తాడులో కనిపిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.