నవరాత్రుల వేళ ఐవీ డ్రిప్ థెరపీ: ఆరోగ్యానికి తీవ్ర ముప్పని హెచ్చరిక
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
నవరాత్రి వేడుకల కోసం అహ్మదాబాద్ నగరంలో యువత గ్లోయింగ్ లుక్ మరియు తక్షణ శక్తి కోసం ఇంట్రావీనస్ డ్రిప్ థెరపీని ఆశ్రయిస్తున్నట్లు వస్తున్న వార్తలపై అపోలో ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందించారు. ఆరోగ్యంగా ఉన్న యువతకు ఇలాంటి వైద్య చికిత్సల అవసరం ఏమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు. మూడు సెషన్లకు పన్నెండు నుండి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు వస్తున్న నివేదికలపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.