మోత్కూర్ మున్సిపాలిటీలో శేఖర్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం
రిపోర్టర్: Madhu Bngr
స్థలం: మోత్కూరు
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఇటీవల మృతి చెందిన ఎడ్ల శేఖర్ కుటుంబానికి ఆయన భార్య నవ్య పదో తరగతి మిత్రులు బుధవారం రూ.36 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నవిత, మౌనిక, సంతోష్, స్వాతి, రేణుక, సరిత, మచ్చగిరి, దుర్గయ్య, శ్రీకాంత్, అర్జున్, రవి, నరేష్, ఉపేందర్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.