ఎన్టీఆర్ జిల్లాలో ప్రజల భద్రత కోసం ఆపరేషన్ త్రిశూల్

రిపోర్టర్: రాము స్థలం: NTR District

ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడంతో పాటు మహిళల భద్రత మరియు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మరియు పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక భద్రతా వ్యూహాన్ని ప్రారంభించారు. ప్రతి ప్రాణాన్ని కాపాడటమే ధ్యేయంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.