రాజధాని అమరావతి అభివృద్ధికి ఏపీ కేబినెట్ భారీ కేటాయింపులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 1,548.98 కోట్లతో పాటు అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు రూ. 661 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.