సిరిసిల్ల అభివృద్ధిని విస్మరించి ఉరిసిల్లగా మార్చారంటూ కేటీఆర్పై సీఎం రేవంత్ విమర్శ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సిరిసిల్ల

తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరుల నిలయమైన సిరిసిల్ల ప్రాంతం ఉరిసిల్లగా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సిరిసిల్ల సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల కన్నీళ్లు, మగ్గం చప్పుళ్లు, ఆందోళనలతో ఈ ప్రాంతం తీవ్ర సమస్యల నిలయంగా తయారైందని, దీనికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.