వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ సమీక్ష
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సత్యశారదాదేవి, చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు వేగంగా జరగకపోవడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటలపాటు పనులు జరిగేలా ప్రత్యేక వర్క్ షెడ్యూల్ తయారు చేసుకోవాలని, కలెక్టర్లు ప్రతిరోజూ పనులను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.