ఇంద్రకీలాద్రి దుర్గమ్మ భక్తులకు శుభవార్త: పోస్టల్ శాఖ ద్వారా ఇంటికి ప్రసాదం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వెళ్లలేని భక్తుల కోసం పోస్టల్ శాఖ ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని ఇంటి వద్దకే అందించే ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో ప్రసాదం కిట్ ధర నూట పదహారు రూపాయలుగా నిర్ణయించామని, భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.