పోలవరం వద్ద నీలి రంగులోకి మారిన గోదావరి జలాలు: సరికొత్త శోభ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఏలూరు

వర్షాకాలం ముగిసి వరద ఉద్ధృతి సద్దుమణగడంతో పోలవరం వద్ద గోదావరి జలాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిలో మట్టి కణాలు తగ్గిపోవడంతో నదీజలాలు రాగి రంగు నుంచి ఆకర్షణీయమైన నీలి రంగులోకి మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. శీలేరు నుంచి వస్తున్న నీరు కూడా స్వచ్ఛంగా ఉండటంతో కాలానుగుణంగా వస్తున్న ఈ ప్రవాహ మార్పులను నది అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.