ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మరో ఏడుగురు చిన్నారుల ఆరోగ్యం విషమం
రిపోర్టర్: గోపి
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో చికిత్స పొందుతున్న మరో ఏడుగురు చిన్నారుల ఆరోగ్యం క్షీణించడంతో వైద్య వర్గాల్లో కలవరం రేపింది. అప్రమత్తమైన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వారిని నాలుగు ప్రత్యేక వాహనాలలో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్‌లో ప్రస్తుతం మరో పదిహేను మంది చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్, ఏసీ పేలడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు పసికందులు మృతిచెందిన సంగతి తెలిసిందే.