మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు: హైకోర్టు ఆదేశాల అమలుకు న్యాయపోరాటం
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్కు ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆగస్టు మూడో తేదీన ఇచ్చిన గడువు ముగిసినా అమలు చేయకపోవడంతో, రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ఉన్నతాధికారులు మరియు జిల్లా డీపీఆర్వోలను ప్రతివాదులుగా చేర్చేందుకు న్యాయ నిపుణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.