పర్ణశాల సినిమా నుంచి జిమ్ జిమ్ తార పూర్తి పాట విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

హారర్ కామెడీ జోనర్లో వస్తున్న పర్ణశాల చిత్రం నుంచి జిమ్ జిమ్ తార పూర్తి పాటను చిత్ర యూనిట్ ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసినట్లు దర్శకుడు వై.జి. భరత్ తెలిపారు. జి.లక్ష్మిదేవి రచించి ఆలపించిన ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచిందని, పూర్తి పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని ఆయన పేర్కొన్నారు.