నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: పువ్వాడ అజయ్ కుమార్

రిపోర్టర్: హరి స్థలం: ఖమ్మం

ఖమ్మంలో బీఆర్ఎస్ నిరుద్యోగ ర్యాలీలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటూ కాంగ్రెస్ యువతను వంచించిందని ఆయన మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. నిరుద్యోగుల ఆశలను నీరుగార్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.