ఎపిక్ ట్రైలర్ లాంచ్‌లో సందడి చేసిన స్టార్ హీరోయిన్ రష్మిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రష్మిక మందన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై రష్మిక ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, వైష్ణవి పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్ రొమాంటిక్ మేకింగ్‌పై రష్మిక చేసిన సరదా వ్యాఖ్యలు ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.