శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రిపోర్టర్: కస్తూరి సురేష్ స్థలం: ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలం పాపిరెడ్డి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శ్రీకృష్ణుడి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, టీడీపీ ఇంచార్జ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా వరలక్ష్మిలను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.