చించినాడ బ్రిడ్జిపై వరుస విషాదాలు.. అధికారుల చర్యల కోసం విజ్ఞప్తి
రిపోర్టర్: K NAGA SRINU
స్థలం: రాజోలు
మలికిపురం మండలం దిండి చించినాడ వశిష్ట గోదావరి బ్రిడ్జి వద్ద జరుగుతున్న వరుస విషాద ఘటనలపై కోనసీమ బిజెపి బిల్డింగ్ వర్కర్స్ సెల్ కన్వీనర్ చిట్టినీడి రంగసాయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఒక కుటుంబం బ్రిడ్జి నుంచి దూకిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చించినాడ, పాసర్లపూడి బ్రిడ్జిలపై ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. బ్రిడ్జి వద్ద నిఘా పెంచాలని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.