భారీ వర్షంతో కనువిందు చేస్తున్న ప్యాపిలి కోన జలపాతం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ప్యాపిలి
ప్యాపిలి మండలం కౌలుపల్లి వద్ద కోన జలపాతం కనువిందు చేస్తోంది. వర్షాలు లేక ఈ ప్రాంతం వెలవెలబోయినప్పటికీ, ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఎగువ నుంచి వచ్చిన ప్రవాహంతో జలపాతం జీవం పోసుకుంది. దీంతో స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ పర్యాటక ప్రాంతంలో కోలాహలం నెలకొనడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.