నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిన్ననాటి ఫోటో ఇదేనని అనుపమ వెల్లడి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో చిన్ననాటి ఫోటో చూసే మార్పు చెందానని నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన ఫోన్ వాల్ పేపర్ పై ఉన్న చిన్ననాటి అనుపమ ఫోటో తనను ఎంతో ప్రభావితం చేసిందని తెలిపారు. ఆ ఫోటోను చూసిన తర్వాతే తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని, ఇకపై తనను తాను బాధ పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.