గోవా కంటే తక్కువ ఖర్చుతో థాయ్లాండ్ ట్రిప్: ట్రావెల్ క్రియేటర్స్ వెల్లడి

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

గోవా ట్రిప్ కంటే తక్కువ ఖర్చుతో థాయ్లాండ్లోని చియాంగ్ మ ప్రాంతాన్ని కేవలం యాభై వేల రూపాయలతో చుట్టేయవచ్చు అని ట్రావెల్ క్రియేటర్స్ కే బాలాజీ మరియు నీతు వెల్లడించారు. ఇటీవల వారు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న వీడియోలో తమ విదేశీ ప్రయాణ అనుభవాలను వివరించారు. ఎయిర్ ఏషియా విమానంలో హైదరాబాద్ నుంచి చియాంగ్ మాయ్కు ప్రయాణించామని, సరైన ప్రణాళిక ఉంటే తక్కువ బడ్జెట్లో విదేశీ పర్యటన సులభంగా పూర్తి చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు.