షాకింగ్ ఘటన: గన్నేరువరం మండలంలో ఉరివేసుకొని పదకొండేళ్ల బాలుడు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: గన్నేరువరం
గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో పదకొండేళ్ల బాలుడు ఎలుక జస్వంత్ యాదవ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై జి. నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం తల్లి వ్యవసాయ పనులకు వెళ్తున్న సమయంలో వెళ్లవద్దని వారించిన బాలుడు, ఆమె తిరిగి వచ్చేసరికి విగతజీవిగా కనిపించాడని వెల్లడించారు. తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.