కారుపై నలభై కిలోమీటర్లు వేలాడిన ధైర్యశాలి పోలీస్ కానిస్టేబుల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కోయంబత్తూరు
కోయంబత్తూరులో గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు సినిమా ఫక్కీలో సాహసం చేసిన హెడ్ కానిస్టేబుల్ ఎం వెలుమురుగన్ ఉదంతం కలకలం రేపింది. నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు రూఫ్ రైల్స్ను గట్టిగా పట్టుకుని నలభై కిలోమీటర్ల దూరం అలాగే ప్రయాణించి వారిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న వంద కిలోగ్రాముల గుట్కాను స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.