భక్తిశ్రద్ధలతో ముగిసిన వినాయక నిమర్జన ఊరేగింపు

రిపోర్టర్: katikapalli perumal స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి పెరుమాళ్ గుడి వీధిలో గణపతి ఊరేగింపు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగింది. స్థానిక ప్రజలు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక నిమర్జన నిమిత్తం భక్తులు భారీగా తరలివెళ్లడంతో ఆ ప్రాంతమంతా గణనాథుని నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానికులు, యువకులు తగిన ఏర్పాట్లు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు.