తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయడానికి కర్ణాటక అంగీకారం

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాలను విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. బెంగళూరులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు కలిసి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన శివకుమార్ వెంటనే అధికారులను తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.