వైద్యం కోసం ఆపన్నహస్తం అందించిన సీఎం సహాయ నిధి

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారు బోయ అనితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, మాజీ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, కాంగ్రెస్ సేవాదళ్ మాజీ జిల్లా అధ్యక్షులు బండి రాము, అరుణ్ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.