అమెరికాలో విద్యార్థులకు పౌష్టికాహార పంపిణీ: రాబర్ట్ వాద్రా ప్రత్యేక కార్యక్రమం

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూజెర్సీ

అమెరికాలోని న్యూజెర్సీ ఎసెక్స్ కౌంటీ కాలేజీలో వరల్డ్ ఫుడ్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహార భోజన కార్యక్రమం నిర్వహించినట్లు పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా తెలిపారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ స్ఫూర్తితో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పటివరకు డెబ్బై వేలకు పైగా భోజనాలను అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాబర్ట్ వాద్రా స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి, వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.