కోవూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన ఉత్సాహభరితం
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ పర్యటనలో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు నాయకులకు ఘనస్వాగతం పలికారు. కోవూరు నియోజకవర్గంలో లోకేష్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న అద్భుత క్షణాలు, కార్యకర్తల ఉత్సాహం మరియు చిరస్మరణీయ జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.