అమరావతిలో మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణా కోసం మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ 66వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అసెంబ్లీ భవనంపై రూ.661 కోట్లతో 250 మీటర్ల ఎత్తైన స్పైర్ నిర్మాణానికి అంగీకరించారు. అమరావతిని సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్ నగరంగా తీర్చిదిద్దాలని, దేశవిదేశాల్లో విస్తృత ప్రచారం చేయాలని సీఎం స్పష్టం చేశారు.