తలకొండపల్లి నిరుపేద బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులందించిన ఎమ్మెల్యే కసిరెడ్డి
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
తలకొండపల్లి మండలానికి చెందిన పలువురు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన నివాసంలో సోమవారం ఘనంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.