ఈ నెల ఇరవై తొమ్మిదిన ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ఈ నెల ఇరవై తొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఓట్ల చోరీ అంశం, ఎన్నికల సంఘం తీరుపై చర్చించేందుకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఢిల్లీకి పయనం కానున్నారు.