అస్సాంలో కూరగాయల తోటలో చిక్కుకున్న పెద్దపులి పిల్ల
రిపోర్టర్: కిరణ్
స్థలం: అస్సాం
అస్సాం రాష్ట్రంలోని బిశ్వనాథ్ జిల్లా బిశ్వనాథ్ ఘాట్ సమీపంలోని నటున్ గావ్ ప్రాంతంలో కూరగాయల తోటలో పెద్దపులి పిల్ల చిక్కుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాజిరంగా జాతీయ పార్కు నుంచి ఈ పులి పిల్ల జనవాసాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. తోట చుట్టూ నెట్ ఉండటంతో అది బయటకు వెళ్లలేకపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పులి పిల్లను సురక్షితంగా రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.