స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయమే లక్ష్యంగా జనసేన శ్రేణులు పనిచేయాలి

రిపోర్టర్: కృష్ణ స్థలం: విశాఖపట్నం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. విశాఖ నగరంలో నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.