రామాయణ సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రముఖ సింగర్ బాద్షా ప్రశంసలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Mumbai

నితేష్ తివారీ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం రామాయణ ప్రత్యేక ప్రదర్శనను ముంబైలో వీక్షించిన ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు బాద్షా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ అత్యద్భుతంగా ఉందని, నటీనటుల అభినయం కంటతడి పెట్టించిందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్ లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది.