ఎమ్మిగనూరులో ఎన్డీఏ ప్రచార జోరు పెంచిన ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి

రిపోర్టర్: AMPAIAH ACHARI స్థలం: ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి దూకుడు పెంచారు. ఎన్డీఏ అభ్యర్థి మాచాని సునీతతో కలిసి పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. రూ.157 కోట్ల తాగునీటి ప్రాజెక్టు, బనవాసి టెక్స్టైల్ పార్క్తో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటూ, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.