మేక్ మై ట్రిప్ మోసానికి వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా

రిపోర్టర్: హరి స్థలం: పంజాబ్

బుక్ చేసిన హోటళ్లు వాస్తవ రూపంలో లేకపోవడంతో రాత్రిపూట కారులోనే చలిలో గడపాల్సి వచ్చిన బాధితుడు రాజేష్ చౌహాన్ కు న్యాయం చేయాలని పంజాబ్ లోని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. మేక్ మై ట్రిప్ సంస్థ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కమిషన్, బాధితుడికి రూ.18,775 రీఫండ్ తో పాటు రూ.25,000 నష్టపరిహారం, రూ.5,000 న్యాయ ఖర్చులు చెల్లించాలని తీర్పు వెలువరించింది.