ఆకాశంలో ఒక తార టీజర్ విడుదల: స్ఫూర్తినింపిన దుల్కర్ సల్మాన్ చిత్రం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆకాశంలో ఒక తార చిత్ర టీజర్ను శనివారం విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామం పరిధులు దాటలేని ఓ అమ్మాయి తన కలల్ని సాకారం చేసుకునే వైనాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ టీజర్ ఆద్యంతం ఎంతో స్ఫూర్తివంతంగా ఉందని, పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.