విద్యార్థులకు ఆర్థిక పాఠాలు: ఎన్సీఈఆర్టీ కొత్త పుస్తకాల్ లో పర్సనల్ ఫైనాన్స్
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
విద్యార్థులకు ప్రాథమిక ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించేలా తొమ్మిదో తరగతి ఎన్సీఈఆర్టీ సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ మరియు పారిశ్రామిక వేత్తల తీరుపై ప్రత్యేక అధ్యాయాలను చేర్చినట్లు ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్న్యాల్ వెల్లడించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, ఈఎంఐలు, పన్నుల గురించి విద్యార్థులు తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వ్యాపార కార్యకలాపాలను సానుకూల దృక్పథంతో చూసే అవకాశం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.