యూజీసీ ఈక్విటీ నిబంధనలు అసమతుల్యంగా ఉన్నాయంటూ ఆర్ఎస్ఎస్ తీవ్ర అభ్యంతరం
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
యూజీసీ ఈక్విటీ నిబంధనలు అసమతుల్యంగా ఉన్నాయని ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. ఈ నిబంధనలపై తమ ఆందోళనలను అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం, యూజీసీ దీనిని గమనించాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఈ నిబంధనలపై స్టే విధించిందని, ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థాన పరిశీలనలో ఉందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్ లో తీసుకునే నిర్ణయాలు సామాజిక సమరసతను కాపాడేలా ఉండాలని ఆయన సూచించారు.