భక్తిశ్రద్ధలతో శ్రీ జయ శంకర గురువుల ఆరాధన మహోత్సవం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నందవరం

శ్రీ జయ శంకర గురువుల ఆరాధన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువు కన్నా ఉన్నతమైన దైవం లేదని స్మరిస్తూ భక్తులు స్వచ్ఛందంగా గురుపూజ మరియు ఆరాధన కార్యక్రమాలను చేపట్టారు. సెప్టెంబర్ 22వ తేదీన గురుపూజ, 23వ తేదీన ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో నందవరం ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదేవుల విశేష ఆశీస్సులు పొందారు.