అర్నాబ్ తుఫాన్ బీభత్సం: బైక్‌పై పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల
రిపోర్టర్: అశోక్
స్థలం: పశ్చిమ గోదావరి
అర్నాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే మోటార్ సైకిల్‌పై పర్యటిస్తూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించానని జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రధాన రహదారులపై అడ్డుగా పడిన భారీ వృక్షాలను తొలగిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.