కన్నీటి సంద్రమైన కుటుంబానికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఏపూరి బాలరాజు తల్లిగారు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయమై సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.