రూ. 267 కోట్లతో నర్సీపట్నం రూపురేఖలు మార్చేశామన్న ఎంపీ చింతకాయల విజయ్

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో రూ. 267 కోట్ల 75 లక్షలతో నర్సీపట్నంలో అభివృద్ధి చేయడం జరిగిందని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ వెల్లడించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 31 మరియు 32 వార్డులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.