తుఫాన్ ముంపు ప్రాంతాలలో జిల్లా ఎస్పీ పరిశీలన: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారిక వివరాల ప్రకారం, తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి స్వయంగా పరిశీలించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన గట్టిగా సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.