కర్నూలు జిల్లాలో వ్యవసాయ కూలీకి దొరికిన విలువైన వజ్రం
రిపోర్టర్: నరేష్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మారెళ్ల గ్రామంలో పొలం పనులకు వెళ్లిన ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం దొరికింది. నాణ్యతను పరిశీలించిన స్థానిక వజ్రాల వ్యాపారి దాన్ని రూ. 3 లక్షలకు కొనుగోలు చేయడంతో కూలీ కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది. తొలకరి చినుకులు కురిసిన ప్రతిసారీ ఈ ప్రాంతంలో రత్నాలు వెలికిరావడం ఆనవాయితీగా మారడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వజ్రాల అన్వేషణను వేగవంతం చేశారు.