ఏపీ నీట్ యూజీ రెండో విడత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ నీట్ యూజీ రెండో విడత ఎంబీబీఎస్ ప్రవేశాల తాత్కాలిక సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసింది. కాంపిటెంట్ అథారిటీ కోటా కింద మొత్తం 1,205 సీట్లను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా సీట్ల కేటాయింపును పరిశీలించుకోవచ్చని సూచించారు.