ఖానాపూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు.అలాగే అటవీ శాఖ నిబంధనలు, అధికారుల అభ్యంతరాల కారణంగా ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. అటవీ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అడ్డంకులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు.