ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టించిన హర్యానా అథ్లెట్ సుచిక తరియల్
రిపోర్టర్: సతీష్
స్థలం: హర్యానా
హర్యానాకు చెందిన 36 ఏళ్ల సుచిక తరియల్ ఆసియా క్రీడల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించి చరిత్ర సృష్టించింది. అయితే సెమీఫైనల్స్ లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టెతో జరిగిన పోరు డ్రాగా ముగియగా, ఉదయం పూట జరిగిన తూనికలో 700 గ్రాముల తేడాతో ప్రత్యర్థి ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో సుచిక కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.