అధికార దుర్వినియోగానికి పాల్పడితే తగిన పరిణామాలు: కడప ఎంపీ అవినాష్ రెడ్డి హెచ్చరిక

రిపోర్టర్: రమేష్ స్థలం: Kadapa

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో వైసీపీ శ్రేణులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.