డోరతీ చిత్రంలో ట్రాన్స్జెండర్ పాత్రపై నటుడు సనాంత్ భావోద్వేగం
రిపోర్టర్: హరి
స్థలం: చెన్నై
డోరతీ చిత్రంలో ట్రాన్స్జెండర్ పాత్ర పోషించడం తనకు దక్కిన గొప్ప వరం అని నటుడు సనాంత్ వెల్లడించారు. ఈ చిత్రంలో సుబ్బు పాత్ర ద్వారా వచ్చిన ఆదరణ తన పదిహేనేళ్ల సినీ ప్రయాణంలో ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. మొదటి రోజు ప్రదర్శన సమయంలో ప్రేక్షకుల స్పందన చూసి కన్నీళ్లు వచ్చాయని, ఈ పాత్ర తన బాధ్యతను మరింత పెంచిందని సనాంత్ పేర్కొన్నారు.