పెద్ద చెరువు గోడు: గండి పడి నిలిచిన రాకపోకలతో అల్లాడుతున్న గ్రామాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: చీపురుపల్లి
శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాంలోని డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువుకు తుపాను ప్రభావంతో గండి పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఇబ్బందులు తలెత్తినా పాలకులు స్పందించలేదని, తక్షణమే శాశ్వత ప్రాతిపదికన గండిని పూడ్చి రైతాంగాన్ని, ప్రయాణికులను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.